టెస్టుల్లో పుజారా 25వ హాఫ్ సెంచ‌రీ..

న‌్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చ‌ర్చ్‌లో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో భార‌త్ అయిదో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచ‌రీ చేసిన హ‌నుమా విహారీ ఔట‌య్యాడు.  రెండ‌వ సెష‌న్ ముగిసే వ‌ర‌కు ఇండియా అయిదు వికెట్లు కోల్పోయి 53.4 ఓవ‌ర్ల‌లో 194 ర‌న్స్ చేసింది.  చ‌తేశ్వ‌ర్ పుజారా 53 ర‌న్స్‌తో ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 25వ అర్థ‌సెంచ‌రీ.  అయిదో వికెట్ విహారీ, పుజారాలు 81 ర‌న్స్ చేశారు.  విహారీ 55 ర‌న్స్ చేసి  క్యాచ్ ఔట‌య్యాడు. ఉద‌యం పృథ్వీ షా కూడా హాఫ్ సెంచ‌రీ చేశాడు.