8 వేల కోట్లు చెల్లించిన భార‌తీ ఎయిర్‌టెల్‌


హైద‌రాబాద్‌:  భార‌తీ ఎయిర్‌టెల్ సంస్థ త‌న బాకీలో భాగంగా ఇవాళ 8004 కోట్ల సొమ్మును టెలికాంశాఖ‌కు చెల్లించింది. ఏజీఆర్ బాకీలు చెల్లించాలంటూ ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే.  అయితే ఆ ఆదేశాల త‌ర్వాత ఎయిర్‌టెల్ సంస్థ ఈమ‌ధ్యే ప‌ది వేల కోట్ల‌ను టెలికాంశాఖ‌కు చెల్లించింది. దానికి తోడుగా ఇవాళ చివ‌రి సెటిల్మెంట్‌లో భాగంగా ఎనిమిది వేల కోట్ల‌ను చెల్లించింది. భార‌తీ గ్రూప్ ఆఫ్  కంపెనీల త‌ర‌పున ఈ పేమెంట్ జ‌రిగింది. బాకీల కింద మూడు వేల కోట్లు, అడ్‌హ‌క్ పేమెంట్ కింద మ‌రో 5 వేల కోట్లు చెల్లించింది.