వనభోజనం చేసిన 10 మంది యువకులు అరెస్ట్


హైదరాబాద్ : లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన 10 మంది కుర్రాళ్ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటు చేసుకున్న‌ది. రెండు నెల‌ల నుంచి ఇంట్లోనే ఉండి విసుగు చెందిన వీరంతా ఒక ప్లాన్ వేసుకున్నారు. వీర‌నం ఏరియాలోని ఒక తోట‌లోకి వీరంద‌రూ చేరుకున్నారు. ఇంటినుంచి తెచ్చిన భోజ‌నం అర‌టి ఆకులో పెట్టి అంద‌రూ వ‌నభోజ‌నం చేస్తుండ‌గా పోలీసుల‌కు స‌మాచారం అందింది. పోలీసులు రైడ్ చేసి 10 మంది యువకులను అరెస్ట్ చేశారు. క‌రోనాను క‌ట్ట‌డి చేయాలంటే ప్ర‌తిఒక్క‌రూ లాక్‌డౌన్ నిమ‌యాలు పాటించాల‌ని పోలీసులు పేర్కొన్నారు.