కొత్త‌గా 81 పాజిటివ్ కేసులు..

ల‌క్నో: ఉత్త‌రప్ర‌దేశ్ లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్త‌గా 81 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2134 కు చేరుకుంది. మొత్తం కేసుల్లో 510 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ‌య్యారు. ఇప్ప‌టివ‌ర‌కు యూపీలో 39 మంది మృతి చెందిన‌ట్లు యూపీ వైద్యారోగ్య శాఖ ప్ర‌తినిధి వెల్ల‌డించారు.


ఉత్త‌రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క‌రోనా హాట్ స్పాట్ల‌ను గుర్తించి..ఆయా ప్రాంతాల్లో రాక‌పోక‌ల‌ను నిలిపేశారు. ఇంటి వ‌ద్ద‌కే నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేస్తున్నారు.